రాయపాటిని బుజ్జగించేందుకే పోలవరం: జాగృతి కవిత

రాయపాటికి చెందిన ట్రాన్స్‌టాయ్ కంపెనీకి పోలవరం టెండర్లు దక్కడంలో మతలబు ఆయన అలకనే కారణమన్నారు. ఆయనను బుజ్జగించేందుకే దీనిని అప్పగించారన్నారు. ట్రాన్స్‌టాయ్ కంపెనీలో రాయపాటి సతీమణి డైరెక్టర్ అన్నారు. ఆయన తన కుటుంబానికి ట్రాన్స్‌టాయ్ కంపెనీ ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో కూడా చూపించలేదని కవిత విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన సాంకేతిక సామర్థ్యం వీరికి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు ప్రాజెక్టులు పంచిపెడుతోందన్నారు. ఇప్పుడున్న డిజైన్‌తో రెండు లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు అవుతారని, లక్ష ఎకరాల సాగు భూమితో పాటు 30వేల ఎకరాల అటవీ భూమి మునిగిపోతుందన్నారు.
కేంద్ర పర్యావణ శాఖ నుండి మొదలు కేంద్ర ప్రభుత్వం వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications