నవంబర్ 1 బ్లాక్ డే కాదు కానీ..: తెలంగాణ కేంద్ర మంత్రి

అందుకే నవంబర్ 1ని బ్లాక్ డేగా పరిగణించం లేదన్నారు. అయితే ప్రజలు బ్లాక్ డేగా జరుపుకోవడాన్ని తాను తప్పు పట్టడం లేదన్నారు. తెలంగాణపై చర్చలు ఇంకా ముగియలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గత ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని మాట తప్పడం వల్లనే ప్రస్తుత పరిస్థితి వచ్చిందన్నారు.
తనకు తన తల్లి జన్మనిస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ జన్మనిచ్చారని, అందుకే ఆమెను ఎప్పటికీ తల్లిగానే భావిస్తానని చెప్పారు. జాతీయ రహదారుల కేటాయింపులో ఇప్పటి వరకు రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, తన హయాంలో రాష్ట్రంలో ఐదారు వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications