వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్ చల్లా కిడ్నాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakasam Map
ఒంగోలు/రాంచి: ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాస రావు కిడ్నాప్‌కు గురయ్యారు. శ్రీనివాస రావుతో పాటు మరో ముగ్గురు కూడా కిడ్నాప్‌కు గురైనట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్ గంజ్ బరాత్ రోడ్డులో గురువారం రాత్రి పదిన్నర గంటలకు చల్లా శ్రీనివాస రావును దుండగులు అపహరించారు.

శ్రీనివాస రావు అపహరణకు గురైనట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. తమకు ఫిర్యాదు వచ్చిందని సాహెబ్ గంజ్ పోలీసులు తెలిపారు. అపహరణకు గురైన శ్రీనివాస రావు జార్ఖండ్‌లో రోడ్డు కాంట్రాక్టులు దక్కించుకున్నారు. రూ.120 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రం పోలీసులు చల్లా జాడ తెలిసిందని, త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు.

చిన్నారి మృతి

ఖమ్మం జిల్లాలో స్కూల్ వ్యాన్ ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఓ విద్యార్థిని మృతి చెందింది. జిల్లా కేంద్రంలో కోర్టు ఎదుట త్రివేణి పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్న రూప అనే ఆరేళ్ల విద్యార్థిని స్కూల్ వ్యాన్ ఎక్కుతుండగా వాహనం ముందుకు కదిలింది. దీంతో ఆమె కిందపడింది. వాహనం వెనుక చక్రాలు చిన్నారి పైనుండి వెళ్లడంతో అక్కడికక్కడమే మృతి చెందింది.

English summary
Prakasam district dairy chairman Challa Srinivas Rao kidnapped by unknown persons in Jarkhand on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X