హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌పై మళ్లీ 'ఢీ'ఎల్: 2004-09 మధ్య వ్యవస్థ నాశనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మరోసారి పరోక్షంగా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్‌హెచ్ఎంకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయక పోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్‌హెచ్ఎంకు కేంద్రం ఎప్పుడో నిధులు మంజూరు చేసిందని, అయితే వాటిని సద్వినియోగం చేసుకునే వీలు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు.

2010లో కేంద్రం విడుదల చేసిన నిధులు అలాగే మురుగుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోకుంటే కేంద్రం వెనక్కి తీసుకుంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రం ఎన్ఆర్‌హెచ్ఎంకు వెంటనే నిధులు మంజూరు సర్కారుపై మండిపడ్డారు. సుప్రీం కేసుల వల్ల ఆరోగ్య మంత్రుల సమావేశంలో నీట్ విషయంపై చర్చించలేదన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన దేశంలోనే శిశు మరణాు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిపై కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారని, రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించాలని సూచించాలని తెలిపారు. ఎన్ఆర్‌హెచ్ఎంకు నిధులు విడుదల చేయక పోవడం వల్లనే సీట్ల మంజూరులో జాప్యం జరుగుతుందని ఆయన చెప్పారు. 108 వాహనాలలో ఆక్సిజన్ సౌకర్యం ఉండదని ఆయన చెప్పారు.

ఆక్సిజన్ సౌకర్యం కొన్ని వాహనాలలోనే ఉంటుందని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు ఎర్రన్నాయుడు కోసం వచ్చిన వాహనంలో ఆక్సిజన్ లేదని తేలిందన్నారు. 2004-2009 మధ్య ప్రభుత్వ వ్యవస్థ నాశనమైందని విమర్శించారు. తనకు ఎవరి పైనా కోపం లేదని, అయితే వ్యవస్థ మరింత నాశనం కాకూడదన్నదే తన ఆవేదన అన్నారు. విశాఖలో వైరాలజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

English summary
Minister DL Ravindra Reddy said that the governing system between 2004-09 was destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X