అంగరంగ వైభవంగా బొత్స కూతురు పెళ్లి: నేతల క్యూ

పెళ్లికి బంధువులు, ప్రముఖులు వస్తుండటంతో విజయనగరం రహదారులు ఉదయం నుండే కళకళలాడాయి. సినీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ పెళ్లి మండపం సెట్ వేశారు. మండపంలో వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన పాదాల వద్ద పెళ్లి పీటలను ఏర్పాటు చేశారు.
బొత్స దంపతులు అందరినీ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, చిరంజీవి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, యాష్కీ, తెరాస చీఫ్ కూతురు కవిత, బిజెపి నేతలు దత్తాత్రేయ తదితరులు భారీగా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications