దేనికైనా రెడీ: బ్రాహ్మణులకు మందకృష్ణ మాదిగ అండ

శుక్రవారం మందకృష్ణ వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణజాతిని కించపరిచిన దేనికైనా రెడీ, బ్రాహ్మనిజం సినిమాలను వెంటనే నిలిపి వేసి, ఆ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాలు ఒక వర్గం మనోభావాలను, ఆ వర్గం మహిళల మనస్సులను గాయపరిచేలా అశ్సీలతగా చూపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తన్నామన్నారు.
ఆ రెండు చిత్రాల్లో బ్రాహ్మణ జాతికి వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల ఆందోళనకు తమ మద్దతు ఉందని చెప్పారు. వారి పక్షాన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో శనివారం కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలియజేస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు.












Click it and Unblock the Notifications