వానపడితే కష్టాలు తెలిశాయి: బురదలో షర్మిల నడక

సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందక రైతులు పంటను ఖాళీగా వదిలేశారని ఆరోపించారు. కరెంటు లేక నీళ్లు లేక రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. ఇలాంటి అసమర్థ ప్రభుతవంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు.
జగన్‌తో రామరాజ్యం ఖాయమన్నారు. షర్మిల శుక్రవారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. పెన్న అహోబిలం మీదుగా మధ్యాహ్నం 2.15కు కోనాపురం క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. కోనాపురం, పేస్థానిపల్లి మీదుగా రహదారు పూర్తిగా బురదతో ఉంది. ఆమె వర్షంలోనే తడుస్తూ.. బురదలోనే నడిచారు.
వానపడుతోంది కాబట్టి తనకు ఇక్కడి ప్రజలు కష్టాలు అర్థమయ్యాయని, ఈ రోడ్డుపై మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జగన్ సిఎం అయ్యాక మీకు రోడ్డు, బస్సులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో షర్మిల తన పాదయాత్రను ముగించారు.












Click it and Unblock the Notifications