ఆ పాట గుర్తుకొస్తుంది: టిడిపి, కాంగ్రెస్‌పై కొండా సురేఖ

భారతి సవాల్‌కు వారు ఎందుకు స్పందించడం లేదని ఆమె శనివారం ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు జగన్ జైలులో సౌకర్యాలు అనుభవిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై కుట్రా రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి అవాస్తవ ప్రకటనతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అండతో జగన్‌కు నిబంధనల ప్రకారం కల్పిస్తున్న సౌకర్యాలు కూడా రద్దు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఇతర విఐపి ఖైదీల కంటే జగన్‌కు ఒక్క అదనపు సౌకర్యం కూడా లేదన్నారు. అదే నిజమైతే టిడిపి భారతి రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. టిడిపి, కాంగ్రెసు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే తన చెవుల్లో 'పెద్దాయనా పెద్దాయనా' మారు మోగుతూనే ఉంటుందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
కాగా షర్మిల అనంతపురం జిల్లాలో 18వ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఉరవకొండ మార్కెట్ యార్డు నుండి ఆమె యాత్ర ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications