Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుఫానుతో రాష్ట్రం అల్లకల్లోలం: ఎఫ్‌డిఐ సభకి కిరణ్!

హైదరాబాద్: 'నీలం' ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ తుఫానులో చిక్కుకొని అల్లకల్లోలం అవుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇతర పర్యటనల్లో బిజీగా ఉందనే విమర్శలు జోరందుకున్నాయి. నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ఆ జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి.

 Rains shaking AP: Kiran in New Delhi

రాకపోకలు స్తంభించాయి. ఓ గ్రామానికి మరో గ్రామానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆయా జిల్లాల్లోని పలు గ్రామాలు, గ్రామాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలువురు ప్రజలు వరద నీటిలో చిక్కుకు పోయారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ, విజయవాడ, విజయనగరంలో కొండచరియలు విరిగి పడ్డాయి. 40 మందితో కూడి ఆర్టీసి వోల్వో బస్సు వరదలో చిక్కుకుంది. రెండు రైలింజన్లు లోయలోకి ఒరిగాయి. పలువురు గల్లంతయ్యారు.

గ్రామాల్లో విద్యుత్ లేక ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. కొన్ని గ్రామాల్లో నాలుగు రోజులుగా విద్యుత్ లేకుండా పోయింది. చాలామంది తిండి లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు. కొందరికి మంచినీరు కూడా అందని పరిస్థితి ఉంది. కోస్తా, తెలంగాణ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. నీలం బీభత్సంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసిన బలప్రదర్శన సభకు వెళ్లడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో నీలం అలజడి సృష్టిస్తే కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మంత్రివర్గం మాత్రం రెండు రోజుల క్రితం విజయనగరంలో పెళ్లికి, ఇప్పుడు రాహుల్ సభకు వెళ్లారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రజల కంటె పెళ్లి, పార్టీ సభలే ఎక్కువనా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా కిరణ్ పైన ధ్వజమెత్తారు. రాష్ట్రం నీటమునిగిపోతే ముఖ్యమంత్రికి ఢిల్లీ పర్యటనలకు కూడా సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెసు ఏర్పాటు చేసిన కాంగ్రెసు ప్రజా సదస్సును వాల్ మార్ట్ సభగా ఇప్పటికే ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తున్న పార్టీలు విమర్శించాయి. ప్రధాన ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కూడా కాంగ్రెసు సభలాగా లేదని, ఎఫ్‌డిఐల కోసం ఏర్పాటు చేసిన సభలా ఉందని మండిపడ్డారు. సభ తీరు ఎఫ్‌డిఐలను సమర్థించుకునేందుకు, రాహుల్‌ను పార్టీలో 'ముఖ్య' నేతగా చూపించేందుకే ఏర్పాటు చేసినట్లుగా ఉందంటున్నారు. దీంతో రాష్ట్రం తుఫానులో కొట్టుమిట్టాడుతుంటే కిరణ్ ఎఫ్‌డిఐ సభకి వెళ్లారని ఎద్దేవా చేస్తున్నారు.

కాగా రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల పదిహేడు మంది మృతి చెందారని రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రకటించింది. జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు. ఆయన జిల్లా కలెక్టర్లు, సిఎస్‌లతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాని ఆదేశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+