ఢిల్లీ యాత్రలే సరిపోవట్లేదు: కిరణ్‌పై షర్మిల ఎద్దేవా

కిరణ్, తెలుగుదేశం పార్ట అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంత అధ్వానంగా ఉన్నారో అధికారులు కూడా అలాగే మారారాని విమర్శించారు. రైతులకు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. గొర్రెలకు జబ్బు చేస్తే మందులిచ్చే వారు లేకుండా పోయారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కార్పోరేషన్ ద్వారా లబ్ధి చేకూరేదని చెప్పారు. వైయస్ ఉంటే పంట రాకపోయినా భీమా వస్తుందన్న ధీమా ఉండేదన్నారు.
షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ పలువురు ప్రవాసాంధ్రులు కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద ఆదివారం నివాళులు అర్పించారు. అనంతరం వారు షర్మిల యాత్రలో పాల్గొనేందుకు అనంతపురం బయలుదేరారు.
రాష్ట్రంలో తుఫాను బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పార్టీ వర్గాలను కోరారు. ఇందులో భాగంగా ఆమె పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్లతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications