సామాన్యూడు ప్రశ్నిస్తున్నాడు: రాహుల్, ప్రధాని ధ్వజం

Rahul Gandhi
న్యూఢిల్లీ: తాము తీసుకు వచ్చిన ఆర్టీఐ చట్టం ద్వారా సామాన్యుడు కూడ ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శఇ రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. న్యూఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెసు పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు రాహుల్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు వచ్చారు. రాహుల్ మొదట మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వం అన్నారు. రాహుల్ ప్రభుత్వ పథకాలను సమర్థించారు.

పేదల కోసం కాంగ్రెసు పార్టీ అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై ఉద్దేశ్య పూర్వకంగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పేద ప్రజల కోసం తాము ఎంతో చేశామన్నారు. ఎఫ్‌డిఐలతో సామాన్యులకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. అవినీతి నియంత్రణకు ఆర్టీఐ(సమాచార హక్కు) చట్టం తీసుకు వచ్చింది తామే అన్నారు. ఆర్టీఐతో సామాన్యులు సైతం ప్రశ్నించే స్థాయికి ఎదిగారన్నారు. ఉపాధి హామీ పథకంతో కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు.

వ్యవస్థ గురించి విపక్షాలు ఏం చెప్పినా స్వీకరిస్తామని, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. వ్యవస్థను మార్చడం యూపిఏ ప్రభుత్వం ఒక సవాల్‌గా తీసుకుందన్నారు. తాము అమ్ ఆద్మీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. లోక్‌పాల్ బిల్లును తీసుకు వస్తామన్నారు. గతంలో బిజెపి ఎఫ్‌డిఐలను ఆమోదించిందన్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల మేలు జరుగుతుందన్నారు. కేవలం కాంగ్రెసు వల్లే దేశం ప్రగతి పథంలోకి వెళుతుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ప్రజల కోసమే అన్నారు.

భారత్‌లోకి కంప్యూటర్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, యువతకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. త్వరలో లోక్‌పాల్ బిల్లు, ఆహార భద్రత బిల్లులు తీసుకు వస్తామన్నారు. మన దేశంలో అతి పెద్ద వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అన్నారు. అవినీతిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే తాము పోరాటం చేస్తున్నామన్నారు. షీలా దీక్షిత్ పాలనలో ఢిల్లీ అభివృద్ధి చెందిందన్నారు. దేశాన్ని నిర్మించే శక్తి కాంగ్రెసుకే ఉందన్నారు.

భారత్ ఎన్నో దేశాలకు ఆదర్శం

భారత దేశం ఎన్నో దేశాలకు ఆదర్శం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. తాము ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు. ఆర్థిక వికాసం దేశంలోని ప్రతి గ్రామానికి కావాలన్నారు. యూపిఏ ఎనిమిదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలను కొంతమంది తప్పు దోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.

జాతి అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల వారికి సమానంగా న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. రైతుల్లో విశ్వాసం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. తమ మొదటి ప్రాధాన్యత రైతులకు లబ్ధి చేకూర్చడమే అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 8 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+