ఆదుకుంటాం: వరద బాధితులకు సిఎం భరోసా

Kiran Kumar Reddy
విజయవాడ: వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ వాహనానికి స్వల్ప ప్రమాదం సంభవించింది. తుని వద్ద కాన్యాయ్‌లోని ఓ వాహనం రాడ్ విరిగింది. ఆ వాహనంలో మీడియా ప్రతినిధులు ఉన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు భరోసా ఇచ్చారు. నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. ఐదు జిల్లాలో పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందిస్తామన్నారు.

మంగళవారం ఉదయం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడానికై వెళ్తూ గన్నవరం విమానాశ్రమంలో దిగిన ముఖ్యమంత్రి అక్కడి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అర్హులైన కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ ఇస్తామని, కౌలు రైతుల అప్పుల రద్దు విషయం ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బుడమేరుపై హైపవర్ కమిటీ వేశామని దానికి శాస్వత పరిష్కార మార్గం చూపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తర్వాత విమానాశ్రయం నుంచి సీఎం వరద ప్రాంతాల ఏరియల్ సర్వేకు బయలుదేరారు. ఆయన వెంటనే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి ఆలస్యంగా ముఖ్యమంత్రి వరద తాకిడి ప్రాంతాలకు బయలుదేరారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో వాతారవణం అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ టేకాఫ్ కావడం కష్టమైంది.

ఎరియల్ సర్వే కోసం ఉదయమే బయలుదేరిన కిరణ్ వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాశ్రయంలోనే నిరీక్షించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, నేతలు కూడా ఉన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కూడా ఆయన కోసం పలువురు నేతలు, మంత్రులు ఉన్నారు. వాతారవరణం అనుకూలంగా లేక పోవడంతో కిరణ్ ఎరియల్ సర్వే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం ప్రారంభమయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+