వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ ముహూర్తంలో కూర్చున్నారో... : సిఎంపై రేణుకా

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudhary
న్యూఢిల్లీ: కిరణ్ కుమార్ రెడ్డి ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారో కానీ... మొదటి రోజు నుంచే ప్రతి రెండు రోజులకోసారి ఆయన మార్పుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, ఇది చాలా విచారకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అన్నారు. అయితే, ఈ రోజుకు ముఖ్యమంత్రి కిరణేనని, ఆ కుర్చీలో ఆయనే కూర్చున్నారు కాబట్టి అంతా ఆయన్ను గౌరవించాలని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయనే కొనసాగుతారో? లేదో? తాను చెప్పలేనన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి మాత్రం విశ్వాసం ఉందని అన్నారు.

కాబట్టి ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చించడం సరికాదని ఆమె అన్నారు. సోమవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కిరణ్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఎమ్మెల్యేలు అధిష్ఠానం పెద్దల్ని కలుస్తున్న విషయం తనకు తెలియదని అన్నారు. వారు వచ్చినట్లు కానీ, కలిసినట్లు కానీ తనకు తెలియదన్నారు. ఏదేమైనా వారు కలవడంలోనూ, తమ అభిప్రాయాలను అధిష్ఠానం పెద్దలకు చెప్పడంలోనూ తప్పేమీ లేదన్నారు.

మీడియా ఊహాగానాలు, వదంతుల నేపథ్యంలో అందరికీ అనుమానాలు వస్తున్నాయని, అందువల్లే వారు అలా చెప్పి ఉండొచ్చునని అన్నారు. కుర్చీలో కూర్చున్నది కిరణే అయినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అని ప్రతిరోజూ అధిష్ఠానం ఎలా ప్రకటిస్తుందని రేణుకా చౌదరి ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చినప్పుడే వరదలు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదని, ఉన్నట్టుండి వరదలు రావటంతో ముఖ్యమంత్రి హుటాహుటిన తిరిగి వెళ్లిపోయారని చెప్పారు.

వరదల వల్ల చాలామంది రైతులకు నష్టం జరిగిందన్నారు. వెంటనే కలెక్టర్లతో మాట్లాడి వరద నష్టంపై ప్రతిపాదనలు సిద్ధం చేసి, తక్షణం రైతులను ఆదుకునే ప్రయత్నంలో తాము ఉన్నామన్నారు.

English summary
AICC spokesperson Renuka Chowdhary has expressed unhappiness on the rumors about the change of CM. She said at present Kiran kumar Reddy is the CM of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X