పేలిన కాన్వాయ్ కారు టైరు: సబితకు తప్పిన ప్రమాదం

ఈ ఘటన తుని వెళ్తుండగా ప్రత్తిపాడు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటన రద్దయింది. కిరణ్ ఈ రోజు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
అంతకుముందు మీడియాతో కిరణ్ మాట్లాడారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, బుడమేరుపై హైపవర్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు.
ప్రతి రైతు నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పారు. వరదల్లో మరణించిన చలమప్పగూడెంలోని ఇద్దరు మహిళల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్షన్నర రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications