వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కామన్' వ్యూ: జగన్‌కు జైలే కరెక్ట్, కాంగ్రెసులోనే ఉంటే...

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

Suman
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల మరో వైపు పాదయాత్రలు చేస్తున్నారు. తమ పాదయాత్రలు ప్రజల మేలు కోసమేనని చెబుతున్నారు. అయితే, వారి పట్ల సామాన్య ప్రజానీకం అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం చేశాం. సామాన్య ప్రజానీకం గొంతు వినిపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా సికింద్రాబాదులోని బాష్ ఆటోమొబైల్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుమంత్ అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం....

"తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అండతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అతడు జైల్లో ఉండటం కరెక్టే. అయితే తామంతా నీతిమంతులే అన్నట్లు కాంగ్రెసువాళ్లు ప్రవర్తిస్తున్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఈ కాలంలో నీతిగా రాజకీయాలు చేసేవాళ్లు ఎవరూ లేరు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు. ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం లాభం. తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి తొలి నుంచి వివాదాస్పదమే. రెండు పాంతాల్లో వీక్ అవ్వడానికి చంద్రబాబు ద్వంద్వ వైఖరే కారణం. రాజకీయాల్లో చంద్రబాబు పని అయిపోయినట్లే.

జైల్లో ఉన్న జగన్ తరుఫున షర్మిల చేస్తున్న పాద యాత్ర కేవలం రాజకీయ లబ్ది కోసమే. రాజకీయాలపై, ప్రజా జీవనంపై అవగాహన లేని వ్యక్తి. అన్న అవినీతిని కప్పిపుచ్చుతూ జనాలను మాయ చేయడం తప్ప మరేమీలేదు. విజయమ్మకు కొడుకుపై ప్రేమ తప్ప ప్రజలపై లేదు. వీరిద్దరు జనం మధ్యలోకి వచ్చి కన్నీళ్లు పెడుతున్నది జనం కోసం కాదు...జగన్ కోసం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటికే సీమాంధ్రలో ఆ పార్టీ పరిస్థితి సగానికి సగం డీలా అయింది. తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రాంతంలో పుంజుకుంటుంది".

English summary

 In an effort to project common men opinions on present day politics, we caught am employee working at Bash Automobiles in Secendurabad. He expressed his opinion on on politics and on political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X