• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నికల్లో పొత్తులుండవు, కాంగ్రెసు డేంజర్: కెసిఆర్

By Pratap
|
K Chandrasekhar Rao
కరీంనగర్‌: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నోరు విప్పారు. కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ జెఎసితో ఉన్న విభేదాలు నిజమేనని అంగీకరించారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 15 పార్లమెంటు సీట్లు, వంద శాసనసభా స్థానాలు సాధించుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తెరాస ప్రభంజనం ప్రారంభమవుతుందని అన్నారు.

కరీంనగర్‌లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో ఆయన పార్టీ నేతలతో ఆయన బుధవారం మాట్లాడారు. కాంగ్రెసును నమ్మొద్దని, అది చాలా డేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పడం వల్లనే తాను చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని, చర్చలకు బ్రేకులు వేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. సమావేశం వివరాలు బయటకు వెళ్లకుండా కెసిఆర్ మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను స్విచాఫ్ చేయించారు.

తెలంగాణ జెఎసిని తామే ఏర్పాటు చేశామని, జెఎసి చైర్మన్‌కా కోదండరామ్‌ను నియమించింది తానేనని, అటువంటి జెఎసి తాము ఎలా వదులుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో విభేదాలు చిన్నవేనని, ఆ సమస్యలు సమసిపోతాయని ఆయన అన్నారు. తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత కోదండరామ్‌తోనూ జెఎసి నేతలతోనూ మాట్లాడుతానని ఆయన చెప్పారు.

మహబూబ్‌నగర్, పరకాల స్థానాల్లో జెఎసి నిర్వాకాన్ని ఎలా మరిచిపోతామని ఆయన అడిగారు. అందువల్లనే తాను కావాలనే జెఎసి నేతలను, కోదండరామ్‌ను దూరం పెట్టానని చెప్పారు. పార్లమెంటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. అలాగే, 29వ తేదీన దీక్షా దివస్ నిర్వహించనున్నారు. ఇది తెలంగాణవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కెసిఆర్ తెలిపారు.

కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తామని వచ్చిన వార్తలు గందరగోళం సృష్టించాయని, కోదండరామ్‌తో విభేదాలపై కూడా ఏమీ చెప్పలేకపోతున్నామని పార్టీ నాయకులు అడిగారు. ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వాలని నాయకులు ఆయన కోరారు.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంతోష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై కెసిఆర్ బుధవారం ఉదయం స్పందించారు. బలిదానాలు వద్దని, బలమైన ఉద్యమ కార్యాచరణతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుందామని కెసిఆర్ అన్నారు. ఎవరూ ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకారమని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

కరీంనగర్ యుద్ధ క్షేత్రం
స్ట్రైక్ రేట్
BJP 50%
TRS 50%
BJP won 1 time and TRS won 1 time since 2014 elections

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao told that there will be no tie ups in 2014 election. He blamed Congress as a dangerous party. He urged the party leaders not believe Congress party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more