100 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లలో గెలుపే కెసిఆర్ టార్గెట్

దీంతో కెసిఆర్ వ్యూహంపై తాజాగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమాన్ని జోరుగా కొనసాగించడం, కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తీసుకు రావడం, తెలంగాణపై తేల్చని పార్టీల నేతలను తమ వైపుకు ఆకర్షించడం, తెలంగాణవాదం వినిపిస్తున్న ఇతర పార్టీల చేతిలోకి ఉద్యమం వెళ్లకుండా చూడటం తదితర అంశాలపై వారు పార్టీ సమావేశాల్లో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద అసెంబ్లీ సీట్లు, 10 లోకసభ స్థానాలను గెలుచుకొని ఏర్పడే ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించి, తెలంగాణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం. ఇది కెసిఆర్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
బుధవారం ప్రారంభమయ్యే సమావేశంలో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేస్తున్న ప్రయత్నాలు, ఇటీవల ఢిల్లీకి వెళ్లి తాను ఏం చేసిందీ వివరించే అవకాశాలు ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లక తప్పదని, కేంద్రంపై ప్రత్యేకించి అధికార కాంగ్రెస్‌పార్టీపై ఒత్తిడితేక తప్పదని ఆయన స్పష్టం చేయనున్నారు. అందరితో మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ఖరారు చేస్తారు.












Click it and Unblock the Notifications