బుల్లెట్ వల్లే పోలీస్ మృతి: బషీర్‌బాగ్ ఘటనపై సిపిఐ

పోలీసు బుల్లెట్ తగిలి పోలీసు చనిపోతే తమపై ఛార్జీషీటు దాఖలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ పోలీసును రక్షించేందుకు తాము ప్రయత్నించామన్నారు. కానిస్టేబుల్ చనిపోయారని తమపై కేసులు పెడితే.. మరి ఇదే ఘటనలో పోలీసుల కాల్పుల కారణంగా ముగ్గురు అమాయకులు మృతి చెందారని దానికి వారేం సమాధానం చెబుతారన్నారు. ఈ ఛార్జీషీటు కాంగ్రెసు కుట్రలో ఓ భాగం అన్నారు.
కాగా టిడిపి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు హింసాత్మకంగా మారి.. బషీర్‌బాగ్ వద్ద అది కాల్పులకు, రక్తపాతానికి దారితీసి ఇప్పటికి 12 ఏళ్లు పూర్తయింది. పుష్కర కాలం తరువాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చార్జీషీట్ దాఖలుకు సిఐడి సిద్ధం అవుతోంది.
నాటి ఘటనకు అసలు బాధ్యులుగా భావించి లెఫ్ట్ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి ( ప్రస్తుతం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి), బివిరాఘవులు (సిపిఎం రాష్ట్ర కార్యదర్శి), పుణ్యవతి (రాఘవులు సహచరి, ఐద్వా జాతీయ నాయకురాలు), గుమ్మడి నర్సయ్య (సిపిఐ(ఎమ్-ఎల్) మాజీ ఎమ్మెల్యే), మానం ఆంజనేయులు (న్యూడెమోక్రసీ), కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ( ప్రస్తుతం ఏఐసిసి కార్యదర్శి) తదితర 28 మందిపై కేసులు నమోదు చేసే దిశగా సిఐడి అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications