చంద్రబాబు, షర్మిల పాదయాత్ర: విజయమ్మ పరామర్శ

మరోవైపు అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల 21వ రోజు తన పాదయాత్రను ప్రారంభించారు. గుంతకల్లు నియోజకవర్గంలో షర్మిల ఈ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ షర్మిల దాదాపు పది కిలోమీటర్ల మేర నడువనున్నారు. గుంతకల్లు శివార్లలో ఆమె ఈ రోజు బస చేస్తారు. నిన్నటి వరకు ఉరవకొండ నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగింది.
ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నీలం తుఫాను బాధిత ప్రాంతాలలో ఈ రోజు కూడా పర్యటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ముంపు ప్రాంతాలలో ఆమె పర్యటిస్తున్నారు. వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ తమ వద్దకు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విజయమ్మ చెప్పారు.
తుఫాను బాధిత ప్రాంతాల ప్రజల సమస్యలను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామని, వారి తరఫున పోరాడుతామని ఆమె బాధితులకు భరోసా ఇచ్చారు. కాగా రేపు విజయమ్మ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాల్లో విజయమ్మ పర్యటిస్తారని పార్టీ నేత పువ్వాడ అజయ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications