వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా హెచ్చరిస్తే..: బాబు, కిరికిరిరెడ్డి అంటూ సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్ నగర్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పుడే హెచ్చరించి ఉంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో అక్రమాలకు అడ్డుకట్ట పడి ఉండేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు రెండూ ఒక్కటేనని అవి పేదలను పీక్కుతునే పార్టీలు అన్నారు. దోచుకున్న వాళ్లంతా జైళ్లో ఉన్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ మందుకు రావడం లేదన్నారు.

గత తొమ్మిదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పర్యటించాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. రైతుల రుణమాఫీపై సాకులు చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి తన పేరును కిరి కిరి రెడ్డిగా మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో చంద్రబాబు 33వ రోజు పాదయాత్ర నిర్వహించారు. తుఫాను కారణంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా ప్రభుత్వానికి కన్పించడం లేదని విమర్శించారు. వరద ప్రాంతాల్లో పర్యటించే తీరిక సీఎంకు లేదని మండిపడ్డారు. కిరణ్ అహంతో వ్యవహరిస్తున్నారని, మొత్తం వ్యవస్థను ఆయన నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక్క సిఎం పదవికే కాదని, ప్రజాజీవితానికే ఆయన అనర్హుడని పేర్కొన్నారు.

రాష్ట్రం నుంచి పది మంది కేంద్ర మంత్రులు ఉన్నా వారంతా ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. 14 జిల్లాల్లో వరదలతో ఆస్తి, పంట నష్టం భారీగా జరిగినా, ప్రధానిని ఎందుకు తీసుకురాలేక పోతున్నారని నిలదీశారు. సొంత పనుల కోసమే మంత్రి పదవులు పొందారా అని నిలదీశారు.

English summary
TD chief Nara Chandrababu Naidu has blamed AICC president Sonia Gandhi for late YS Rajasekhar Reddy regime corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X