భార్య ఆత్మహత్య కేసుతో కలత: వైద్యుడి ఆత్మహత్య

Hyderabad
హైదారాబాద్: భార్య ఆత్మహత్య కేసు తన మీదికి రావడంతో ఓ ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలాజీ నాయక్ అనే ప్రభుత్వ వైద్యుడు తనకు తాను మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం యాంజాల్ గ్రామానికి చెందిన బాలాజీ నాయక్, మాధవీలత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గైనకాలిజిస్టు అయిన మాధవీలత మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి బాలాజీ కారణమంటూ మాధవీలత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బాలాజీని అరెస్టు చేశారు. బెయిల్ మీద ఐదు రోజుల క్రితం అతను బయటకు వచ్చాడు.

తీవ్రంగా కలత చెందిన బాలాజీ నాయక్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మృతికి తాను కారణం కాదని, తనని అనవసరంగా కేసులో ఇరికించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని నోట్‌లో రాసి అతను మరణించాడు. తండ్రి కూడా మరణించడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వనస్థలిపురంలోని తన నివాసంలో బాలాజీ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న వైద్య దంపతులు తుర్క యాంజాల్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ వచ్చారు. తాను హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో గల ఇబ్రాహీంపట్నంలోని మాల్ గ్రాంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంగళవారం రాత్రి తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు.

తీవ్ర ఆందోళనకు గురైన బాలాజీ కుటుంబ సభ్యులు మాల్‌కి వెళ్లి జాడ కనిపించకపోవడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. బాలాజీ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని వారికి తర్వాత తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+