వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే: వైయస్ విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
ఏలూరు/అనంతపురం: ప్రజలు తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం అన్నారు. ఆమె తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

అప్పుడే రాష్ట్ర ప్రజలకు సమస్యల నుండి విముక్తి కలుగుతుందన్నారు. గోదావరి ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌కు తాను వివరిస్తానని, నష్టపరిహారం అందేందుకు కృషి చేస్తానని ఆమె చెప్పారు. డెల్టా ఆధునికీకరణ పూర్తిచేయనందునే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఆధునికీకరణ పనులు పూర్తి చేయించేవారన్నారు.

నష్టపోయిన వారిని ఆదుకోవడంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కాగా విజయమ్మ 8వ తేది నుండి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. నీలం తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాలలో ఆమె తిరిగి రైతులను పరామర్శిస్తారు. పర్యటన ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఈ విషయాన్ని జిల్లా పార్టీ నేత పువ్వాడ అజయ్ కుమార్ తెలియజేశారు.

అనంతలో షర్మిల పాదయాత్ర

తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చి ఉండే వారని షర్మిల అనంతపురం జిల్లాలో తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అన్నారు. వైయస్ పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా కుమ్మక్కయ్యారని విమర్శించారు.

English summary

 YSR Congress party honorary president YS Vijayamma said state will develop after YS Jaganmohan Reddy become chief minister of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X