వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా ఆలోచన: నో తెలంగాణ, ఇందిరా బాటనే

By Pratap
|
Google Oneindia TeluguNews

 Sonia Gandhi
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అత్తగారు ఇందిరా గాంధీ తొక్కిన తొవ్వనే తొక్కాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేమనే స్పష్టమైన ప్రకటన చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ కోసం ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తనను కలసిన కొందరు సీనియర్ల వద్ద సోనియా సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం.

ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదని ఆ నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇందిర కూడా రాష్ట్ర విభజనకు విముఖత వ్యక్తం చేసినందున, తాను కూడా అదే మార్గంలో నడవాలని సోనియా కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె ధోరణి చెబుతోందని ఆ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి రాదని చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, దానికీ సిద్ధంగా ఉండాలన్న ధోరణి పలువురు సీనియర్ల వద్ద వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటుచేసి, ఎన్నికల్లోగా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అభివృద్ధి మంత్రంతోనే వెళ్లాలని నిర్ణ యించుకున్నట్లు ఆమె ధోరణి స్పష్టం చేస్తోంది.

తెలంగాణ ప్రాంతీయ మండలికి డీఎస్‌ను అధ్యక్షుడిగా నియమించవచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడంతోపాటు, వాటిని ఖర్చు పెట్టే స్వేచ్ఛను కూడా ఇవ్వడం ద్వారా, నిధుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమే యం లేకుండా చేయనున్నారు.
ఈ విషయంపెై నాయకత్వం మరో వారం రోజుల పాటు నేతలను ఢిల్లీకి పిలిపించి, వారితో చర్చలు జరపాలని నిర్ణయించింది.

ఇటీవలి కాలంలో సోని యాను కలిసిన కోస్తా, సీమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ, నాయకత్వ మార్పు గురించి చర్చించారు. తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, డిఎస్, జానా రెడ్డి పేర్లను కూడా ఆమె ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పు, తెలంగాణ అభివృద్ధి మండలి ఒకేసారి ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తాజాగా వెల్లడిస్తున్నాయి. తెలంగాణపై ఏదో ఒకటి చెప్పకపోవడం వల్ల మరింత గందరగోళం పెరిగే ప్రమాదం ఉందంటూ ఇరు ప్రాంతాల నేతలూ నాయకత్వాన్ని చాలాకాలం నుంచీ ఒత్తిడి చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇకపెై ఈ గందర గోళానికి తెరదించి, అభివృద్ధి మండలితో అభివృద్ధి పనులు చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

English summary
It is said that Sonia Gandhi has prepared to take anti Telangana decission soon. She wants to settle the issue with constituting Telangana regional board giving legal powers to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X