చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టెక్కీ ఆత్మహత్య: వేధింపులపై భర్త అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Suicide: Techie's hubby arrested
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని కార్యాలయం భవనం ఆరో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా టెక్కీ నళిని భర్తను పోలీసులు అరెస్టు చేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిప్రెషన్ ఆమె ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావించారు. పెళ్లయి పద్నాలుగు నెలలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని నళిని తీవ్ర నిస్పృహకు లోనైనట్లు ఆమె భర్త పోలీసులకు చెప్పాడు.

అయితే, వరకట్నం వేధింపులు భరించలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నళిని భర్తను అరెస్టు చేశారు. నళిని భర్త ఎంత సొమ్ము డిమాండ్ చేశాడనే విషయాన్ని వారు పోలీసులకు చెప్పలేదని అంటున్నారు.

చెన్నైలోని తాంబారంలో తన కార్యాలయ భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. కార్యాలయంలో పని ముగించి, ఇంటికి వెళ్లే సమయంలో ఆర్ నళిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

మద్రాసు ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌లోని కార్యాలయం భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త రామ్ కుమార్‌తో కలిసి నళిని తాంబారం సమీపంలోని పుజితివాక్కంలో నివాసం ఉంటోంది. రామ్ కుమార్ టి. నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.

నళిని భవనంపై నుంచి దూకిన విషయాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఆ భవనంలో పలు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. తాంబారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

English summary
The Chennai police have arrested the husband of a 26-year-old woman techie who committed suicide on Monday night, by jumping off the sixth floor of her office building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X