వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కామన్' వ్యూ: వైఎస్ మంచి ఓ వైపే, బాబుది మరోవైపు

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

Rajesh
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు ఎటు వైవు మలుపు తిరుగుతున్నాయనేది అంతు పట్టకుండా ఉంది. ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల మరో వైపు పాదయాత్రలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల మేలు కోసమేనని చెబుతున్నారు. అయితే, వారి పట్ల సామాన్య ప్రజానీకం అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం చేశాం. సామాన్య ప్రజానీకం గొంతు వినిపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మొబైల్ షాప్ నిర్వహిస్తున్న రాజేష్ అభిప్రాయాలు ఇక్కడ పొందు పరిచాం.

"నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినా...నేడు చంద్రబాబు చేస్తున్నా..... పాదయాత్రలు పదవుల కోసమే. రాజకీయాలు కలుషితమై చాలా కాలం అయింది. తన పాదయాత్రలతో ప్రజలను ఫిదా చేసి సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వైఎస్ మంచి తనం నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు అవినీతితో తన విశ్వరూపం చూపించాడు. వైఎస్ అవినీతి గురించి రాష్ట్రంలోని జనాలందరికీ తెలుసు. కాక పోతే ఆయన వల్ల లబ్ది పొందిన వారు ఆయన అవినీతిని ఒప్పుకోవడానికి ఇష్ట పడరు.

వైఎస్ వారసుడిగా జగన్ రాజకీయ పార్టీ పెట్టింది ఆస్తులను కాపాడు కోవడానికి, తండ్రి అవినీతిని కప్పిపుచ్చడానికే. జగన్ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుంది నిజమే..కానీ అవినీతి కూడా పెరిగి పోతుంది. అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల కొన్నేళ్ల వరకు బాగానే ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఇబ్బంది తప్పదు. అన్నీ ఫ్రీగా ఇవ్వడానికి అప్పులు చేస్తారు, ప్రభుత్వ భూములు అమ్ముతారు. ఇలా ఎంత కాలం ఇస్తారు?

చంద్రబాబు హయాంలో రైతులుకు మంచి జరుగలేదు నిజమే కానీ....ఆయన హయాంలో చేసిన కొన్ని పనులు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. అప్పుడు వైఎస్ ప్రభుత్వంలో ఉన్నంత అవినీతి లేదు. మన జనాలకు ఈ రోజు లాభం జరిగిందా, లేదా అనేదే ముఖ్యం...భవిష్యత్ గురించి ఎవరూ ఆలోచించరు. ఫ్రీగా ఇచ్చి పన్నులు, రేట్లు పెంచితేనే మనోళ్లకు హాయిగా ఉంటుంది...ముందు జనం మారాలి.

కేసీఆర్ పార్టీ తెరాస, బీజేపీ పార్టీలు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి కానీ....వారికి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు. రాజకీయ ఆధిపత్యం, పదవుల కోసం వారి ఆరాటం. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పాలన ఎంత త్వరగా పోతే అంత మంచింది. అభ్యుదయ భావాలు ఉన్న లోక్ సత్తా లాంటి పార్టీలు అధికారంలోకి వస్తే కాస్త మంచి జరుగుతుంది. అంతకంటే ముందు జనాల్లో మార్పురావాలి".

English summary
A mobile shop owner Rajesh said that YS Rajasekhar Reddy goodwill is one side of the coin. In Telugudesam president N Chandrababu naidu's regime farmers were ignored.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X