ఫేస్‌బుక్‌లో పెళ్లి పేరుతో మోసం, యువకుడి అరెస్టు

అందిన వివరాల ప్రకారం - బోయిన్‌పల్లికి చెందిన రాజపతి(31) ఇంటర్ మధ్యలో మానేశాడు. 3.5 అడుగుల ఎత్తున్న రాజపతి గుర్తుతెలియని అందమైన యువకుడి ఫొటోతో అమ్మాయిలకు వల వేసేందుకు ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ తెరిచాడు. ఇతడి బుట్టలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి పడింది. రాజపతి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అసలు డ్రామాకు తెర తీశాడు.
తనను పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు చాలా బంగారం ఇస్తారని ఆమె చెప్పింది. దాంతో తనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, చికిత్సకోసం సాయం చేయమని కోరాడు. దాంతో ఆ యువతి రూ.3 లక్షలు నగదు, 50 తులాలకుపైగా బంగారు అభరణాలను అతడికి ఇచ్చింది. తనను తాను రాజపతి స్నేహితుడు శ్రీధర్‌గా పరిచయం చేసుకుని, రాజపతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పి నిందితుడు నగదు, నగలను తీసుకెళ్లేవాడు.
చివరకు మోససోయినట్లు గుర్తించిన బాధితురాలు సిఐడి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. యువతి నుంచి దోచుకున్న బంగారంలో కొంత విక్రయించాడని, మరికొంత తనఖా పెట్టాడని చెప్పారు. మొత్తం రూ.4,75,000 నగదు, ముత్తూట్ ఫైనాన్స్ నుంచి 180గ్రామలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని రమణమూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications