అమ్మాయిని రేప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు, బంధువు

Uttar Pradesh
లక్నో/చండీగఢ్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ శాసనసభ్యుడి తనయుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి సదరు ఎమ్మెల్యే కొడుకు పదిహేడేళ్ల బాలికను అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితారాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం ముజఫర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బిఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కొడుకు నయీమ్, ఎమ్మెల్యే బావమరిది నామన్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బసారియా గ్రామం నుంచి ఆ మైనర్‌ను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. విషయం బయటపెడితే చంపేస్తామని నిందితులు బాధితురాలని హెచ్చరించారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే అహ్మద్ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.

మరోవైపు హర్యానాలోని హిసార్, భివానీ జిల్లాల్లో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారానికి గురయ్యారు. హిసార్‌లో ఈ నెల 3వ తేదీన తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలికపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డ కేసులో నిందితులను శనివారం అరెస్టు చేశారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంట్లోనే ఈ దారుణ సంఘటన జరిగింది. మరో అత్యాచార ఘటన 8వ తేదీన చోటుచేసుకొంది. దాద్రి సబ్‌డివిజన్‌లో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు లైంగిక అకృత్యానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+