వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శంకర్‌దాదా' తరహా హైటెక్ కాపీయింగ్: తెలుగు వారూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Junior Doctors are caught in High Tech copying
చండీగఢ్: వైద్యవిద్య ప్రవేశ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలైంది. వైద్య విద్యా సంస్థల్లో చండీగఢ్ పిజిఐఎంఈఆర్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పిజిఐలోని వివిధ విభాగాల్లో పిజి వైద్య కోర్సుల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్‌కు పాల్పడుతూ చండీగఢ్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వారు దొరికిపోయారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశవ్యాప్తంగా కాపీయింగ్‌కు పాల్పడుతున్న పెద్ద ముఠాను శనివారం సిబిఐ అరెస్టు చేసింది.

ఏడుగురు మహిళా వైద్యులతో సహా మొత్తం 17 మందిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురు వైద్యులు ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన వారని సమాచారం. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏడు వేలమంది హాజరవుతున్నారు. సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు ఈ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. నాలుగు కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థినులు వారికి చిక్కారు.

అత్యాధునిక లాప్‌టాప్‌లు, మైక్రోఫోన్లు, సూక్ష్మ కెమెరాలు, ఫోన్లు, బ్లూటూత్, వైర్‌లెస్ ఇయర్ ప్లగ్‌లు వంటి పరికరాలను ఉపయోగించి ఈ ముఠా కాపీయింగ్‌కు పాల్పడుతోంది. ఎవరికీ కనపడకుండా దుస్తులకు పెట్టుకున్న కెమెరాలు, ఫోన్లతో వీరు ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి, బయటకు పంపేవారు. ఈ ప్రశ్నపత్రాన్ని బయట ఉన్న ఏడుగురు వ్యక్తులు తీసుకొని, హైదరాబాద్, పాట్నాల్లో ఉన్న నిపుణులకు పంపేవారు.

నిపుణులు పంపిన సమాధానాలను విద్యార్థులకు బ్లూటూత్, వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల ద్వారా అందించేవారని సిబిఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాపీయింగ్ కోసం విద్యార్థులు అత్యాధునిక పరికరాలను అమర్చుకొనే విధంగా ప్రత్యేక దుస్తులను ధరించారని సిబిఐ వెల్లడించింది. ఈ దుస్తుల్లో బటన్ కెమెరాలు, ఫోన్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలు ఎవరికీ కనపడకుండా ఇమిడిపోతాయి. దీంతో ఎవరికీ అనుమానం కలగదు. ఏడుగురు విద్యార్థినులతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసినట్లు సిబిఐ వెల్లడించింది.

English summary

 Seventeen arrested by CBI for High Tech copying for their exams in Chandigarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X