వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు రండి: బాబుకు, కాంగ్రెస్‌కు జగన్ పార్టీ సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
కర్నూలు/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించడంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం అన్నారు. మైనార్టీలో పడిన ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం వెంటనే బలనిరూపణ చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెసు పార్టీకి బలం ఉన్న సమయంలో అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైనార్టీలో పడినప్పటికీ ముందుకు రాకపోవడం శోచనీయం అన్నారు. మైనార్టీలో పడిన ప్రభుత్వంపై చంద్రబాబు తన వైఖరి తెలియజేయాలన్నారు. కిరణ్ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారని శోభా నాగి రెడ్డి అన్నారు.

మద్దతు ఉపసంహరణ హర్షణీయం

కిరణ్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బాబ్రీ ఘటనకు కాంగ్రెసు ప్రధాని పివి నరసింహ రావే కారణమన్నారు. రాజీవ్ గాంధీ దానికి తెరలేపారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో కానీ రాష్ట్రంలో మతఘర్షణలు లేవని, సామరస్యం వెల్లువిరిసిందన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల కుట్రను ముస్లింలు గమనించాలని హితవు పలికారు. ఆ రెండు పార్టీలు మైనార్టీ ముస్లింలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గవర్నర్ విశ్వాస తీర్మానానికి ఆదేశిస్తే తమ నిర్ణయం వెల్లడిస్తామని టిడిపి నేత పెద్దిరెడ్డి వేరుగా అన్నారు.

English summary

 YSR Congress party MLA Sobha Nagi Reddy said Kiran Kumar Reddy government is in minority with MIM withdraw their support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X