పాతబస్తీ ఉద్రిక్తం: పరిపూర్ణానంద స్వామి సహా అరెస్ట్

Paripoornananda Swami
హైదరాబాద్: చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రముఖ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో ఎంఐఎం, ప్రభుత్వం తీరును ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు భారీ ర్యాలీని నిర్వహించాయి.

ఈ ర్యాలీని భాగ్యలక్ష్మి ఆలయం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో పరిపూర్ణానంద స్వామితో సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఆలయం విషయమై మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆదివారం చార్మినార్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు హిందూ ధార్మిక సంస్థలు ర్యాలీ చేపట్టాయి. పోలీసులు వారిని కూడా అడ్డుకున్నారు. చార్మినార్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

పూజలు అడ్డుకోవడం సరికాదు.. వెంకయ్యనాయుడు

మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు, డిమాండ్లకు తలొగ్గడం కాంగ్రెసు పార్టీకి కొత్త కాదని చెన్నైలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు అడ్డుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+