బాబు తీరు నచ్చకే, చెప్పుడు మాటలు విని..: సంకినేని

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక ఆయనను జైలులో పెట్టారని ఆరోపించారు. కేంద్రమంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలవాల్సిన అవసరం బాబుకు ఏమిటని ప్రశ్నించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎక్కువ పథకాలు పెట్టారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలన్నదే రాష్ట్ర ప్రజల ప్రగాఢ ఆకాంక్ష అని సంకినేని అన్నారు.
గత 28 సంవత్సరాలుగా అడుగులో అఢుగు వేసి తనతో నడిచిన నాయకులు, కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తున్నానన్నారు. తుది వరకు ఒకే పార్టీలో కొనసాగాలని భావించినప్పటికీ బాబు జిల్లాలో ఒకరిద్దరి చెప్పుడు మాటలు విని పార్టీ కోసం పని చేసిన తనలాంటి వారిని పార్టీ విడిచి పెట్టేలా చేశారన్నారు. తాను అవకాశవాదంతో జగన్ పార్టీలో చేరడం లేదని, వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ పార్టీలో చేరితే అవకాశవాదం అవుతుందన్నారు.
అధికారంలో లేని పార్టీలో చేరితే అవకాశవాదం ఎలా అవుతుందన్నారు. తెలంగాణలో టిడిపి గల్లంతు కావడానికి కారణమైన దేవేందర్ గౌడ్‌కు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చి బాబు అసలు అవకాశాది అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని చంద్రబాబు ఎప్పుడో తుంగలో తొక్కారన్నారు.












Click it and Unblock the Notifications