రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస, జగన్ పార్టీలపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌ నుంచి ఆయన మంగళవారం పాదయాత్ర ప్రారంభించి, పెదమాదారం మీదుగా కొనసాగించారు. కేసుల నుంచి బయటపడేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెరాస ఏమి చేసిందని ఆయన అడిగారు.

తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారమే ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు.

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పండగ పూట పిల్లలకు తిండి కూడా పెట్టలేని దుస్థితిని కాంగ్రెసు ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కలిసిపోయేందుకు రాత్రుళ్లు రాయబారాలు నడుపుతోందని వ్యాఖ్యానించారు. గత 12 ఏళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధికి తెరాస ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దొంగల చేతికి తాళాలు వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. దోచుకోవడమే ధ్యేయంగా కాంగ్రెసు నాయకులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. తాము 2008లోనే తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై అకిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu has kashed out at YS Jagan's YSR Congress and K Chandrasekhar Rao's Telangana Rastra Samithi (TRS). He said that he ready for open debate on Telangana development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X