వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపావళి వేడుకలకు కిరణ్ రెడ్డి, చంద్రబాబు దూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకలకు దూరంగా ఉన్నారు. నీలం తుఫాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన స్థితిలో దీపావళి వేడుకలకు ముఖ్యమంత్రిగా దూరంగా ఉన్నారు. తమ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు మృతి, నీలం తుఫాను వల్ల సంభవించిన నష్టం, ప్రజల ఆర్థిక సమస్యల కారణంగా చంద్రబాబు దీపావళి వేడుకలకు దూరంగా ఉన్నారు.

నీలం తుఫాను వల్ల రైతులతో పాటు ఇతర వర్గాల వారు తీవ్రంగా నష్టపోయినందున వారికి సంఘీభావంగా దీపావళి జరుపుకోకూడదని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు ఆయన కార్యాలయం అధికారులు తెలిపారు. దాంతో దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు ఎవరూ రావద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

దీపావళి వేడుకలకు నిర్వహించుకోకూడదని నిర్ణయించుకున్నందున శుభాకాంక్షలు తెలపడానికి చంద్రబాబు వద్దకు ఎవరూ రావద్దని తెలుగుదేశం పార్టీ నాయకుడు గరికపాటి రామ్మోహన్ రావు సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.

English summary
CM Kirana kumar Reddy and Telugudesam president N Chandrababu Naidu have decided not to celebrate Deepavali in solidority with Neelam cyclone victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X