వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పాదయాత్ర: చివరి పోరు... కలిసిపోతూ..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో సాగుతోంది. ఆయన పాదయాత్రకు తెలంగాణలో ఇప్పటి వరకు చెదురుమొదురు వ్యతిరేకతలు మాత్రమే ఎదురయ్యాయి. తెలంగాణకు తాను వ్యతిరేకం కానంటూ ఆయన ప్రతి చోటా చెప్పుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కడిగిపారేస్తున్నారు. కాంగ్రెసు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

చిన్నపిల్లలను ఎత్తుకుంటూ వారికి తానెంతో కావాల్సిన వాడిని అని అనిపించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రజలకు ఈ రకంగా ఆయన మరింత దగ్గర కావాలని అనుకుంటున్నారు.

బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

కల్లుగీత పనివారలకు తమ ప్రభుత్వం వస్తే చేసే మేలుపై వారికి వివరిస్తున్నారు. నిచ్చెన వేసుకుని ఇటీవల తాటిచెట్టు కూడా ఎక్కి ఆయన కల్లు గీశారు.

బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

మైనారిటీలకు తమ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మేలు జరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు.

బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

గిరిజనులకు తాను అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై చంద్రబాబు తన పాదయాత్రలో వివరిస్తున్నారు.

బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

ఇటీవలే బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు వృత్తిపనివారి కోసం ఆదరణ పథకాన్ని అమలు చేస్తానని చెబుతున్నారు. వారితో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 బాబు పాదయాత్ర: చివరి పోరు... ఇలా...

ఆటల్లో కూడా పాలు పంచుకుంటూ ప్రజలతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాను మీ వాడిని అని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

తన పాదయాత్రలో చంద్రబాబు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, ఆయన వరాల వర్షం కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను వర్గాలవారీగా వివరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వృత్తులవారీగా సామాజిక వర్గాలను పలకరిస్తున్నారు. వారి పనిలో కూడా ఓ చేయి వేస్తున్నారు. వస్తున్నా.. మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు వర్గాలవారీగా ప్రజలకు తాను చేసే మేళ్లపై హామీలు ఇస్తున్నారు. ఆయన శ్రమకు ఫలితం దక్కుతుందో, లేదో చూడాలి.

రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు గెలుపు కోసం చేస్తున్న చివరి పోరాటంగా పాదయాత్ర చేపట్టారని అంటున్నారు. నిజానికి, వచ్చే ఎన్నికలు ఆయనకు జీవన్మరణ సమస్యగానే చెప్పాలి. ఈసారి పార్టీ ఓడిపోతే పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంటుందని అంటున్నారు. దీంతో చంద్రబాబు తన కోసం, తన పార్టీ కోసం ప్రజల్లో కలిసిపోయి, మీలో నేనూ ఒక్కడ్ని అని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu is continuing his padayatra in Telangana region. He is not facing strong protests from Telanganites. He is trying to get the confidence of Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X