హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోలో ఆరుకోట్లు: బాల సాయి ట్రస్టుకు ఐటి నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bala Saibaba
హైదరాబాద్: బాల సాయిబాబా ట్రస్ట్‌కు ఆదాయపన్ను శాఖ(ఐటి) బుధవారం నోటీసులు జారీ చేసింది. సేకరించిన విరాళాల వివరాలు తెలపాలని ఐటి అధికారులు బాల సాయిబాబా ట్రస్ట్‌ను ఆదేశించారు. ఇటీవల డీజీపీ కార్యాలయం సమీపంలో ఒక ఆటోలో పోలీసులు కనుగొన్న ఆరున్నర కోట్ల రూపాయల డబ్బు ఈ ట్రస్టుకు సంబంధించినదిగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వచ్చిన విరాళాలలకు లెక్కలు చెప్పాలని లెక్కలు చెప్పాలని బాల సాయిబాబా ట్రస్టుకు నోటీసులు ఇచ్చింది.

బాల సాయిబాబా ట్రస్ట్‌కు సంబంధించిన ఫైళ్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తెలపాల్సిందిగా ఆదేశించింది. వారం రోజుల క్రితం డిజిపి కార్యాలయం ఎదుట దొరికిన డబ్బు తమదేనని రియల్ ఎస్టేట్ వ్యాపారి రామారావు సిసిఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈయన బాల సాయిబాబా ట్రస్టు చైర్మన్‌గా ఉన్నారు. దీంతో బాల సాయిబాబా ట్రస్టుకు నోటీసులు ఇవ్వాలని ఐటి శాఖ ఆలోచించింది.

ఆటోలో దొరికిన ఆరున్నర కోట్ల రూపాయలు తనవేనని రామారావు పోలీసులకు తెలిపారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. తాను చంపాపేట యాక్సిస్ బ్యాంక్ నుండి రూ.2 కోట్లు తీసుకున్నానని, అవన్నీ రూ.500 నోట్లని, అలాగే కర్నాటక నుండి ఆరున్నర కోట్ల రూపాయలు, వెయ్యికోట్ల కట్టలు వచ్చినట్లు తెలిపారు. ఆ డబ్బు తనదే అని అతను ముందుకు రావడంతో పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు.

దొరికిన డబ్బు అంతా కొత్త నోట్లేనని తెలుస్తోంది. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ నుండి డ్రా చేశారు. సీరియల్ నెంబర్ల ఆధారంగా డబ్బు ఎవరిదో తెలుసుకోవచ్చునని చెబుతున్నారు. ఇవి రాజకీయ నాయకుడివా లేక పోలీసులను ఆశ్రయించిన వ్యాపారివా తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆ డబ్బు తనదేనని పోలీసుల విచారణలో రామారావు తెలిపారు. తాను లాండ్ కొనేందుకే ఆ డబ్బును ఆటోలో తరలిస్తున్నట్లుగా పోలీసులకు చెప్పాడు. అతను నాలుగున్నర కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పినప్పటికీ మరో రెండు కోట్ల రూపాయలకు చెప్పలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో బాల సాయిబాబుకు నోటీసులు ఇవ్వాలని ఐటి శాఖ అనుకుంటోంది.

English summary
Income Tax department issued notices to Bala Saibaba trust on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X