చిరంజీవి 150వ సినిమాపై లగడపాటి: పదవులపై కిరణ్

ఏ నిర్ణయమైనా మనపైనే ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఆయన సూచించారు. దేశంలో చదువుకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు ఎందులోనూ తీసిపోవన్నారు. ఇది ఐఐటి ఎంట్రన్స్ ఫలితాల్లో రుజువైందన్నారు. జీవితంలో మనకెవరూ సహాయం చేయరన్నారు. మన నిర్ణయం సరైనది అయితే భయపడాల్సిన పనే లేదని, భయపడుతూ బతికితే అది బతుకే కాదన్నారు.
చిరంజీవి 150వ సినిమా సందేశం ఇచ్చేలా
కేంద్రమంత్రి చిరంజీవి 150వ సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా రూపొందిస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజయవాడలో అన్నారు. రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో బాలల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, లగడపాటి రాజగోపాల్, మంత్రి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ... చిరు 150వ సినిమా సమాజానికి సందేశం ఇచ్చేలా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తి చిరంజీవి అని పార్థసారథి అన్నారు. ప్రభుత్వం పడిపోకూడదన్న సదుద్దేశ్యంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారన్నారు.












Click it and Unblock the Notifications