హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహావీర్‌ కోసం మజ్లిస్ రగడ, జగన్ ఓల్ట్‌ఫ్రెండ్:పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: మహావీర్ ఆసుపత్రి స్థలం పొందడం కోసమే మజ్లిస్ పార్టీ భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఆరోపించారు. కాంగ్రెసు, యూపిఏ ప్రభుత్వాలకు మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకుంటుందని పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం సరికాదన్నారు. మహావీర్ స్థలం కోసం భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని తెరపైకి తీసుకు రాలేదని ఓవైసీ గుండెపై చెయ్యి పెట్టుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఓవైసీ ప్రకటన సరికాదన్నారు. అసద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాతమిత్రుడే అన్నారు. మజ్లిస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. మజ్లిస్ కలిసేది జగన్ పార్టీతోనే అన్నారు. ఓవైసీ నిర్ణయాన్ని మెజార్టీ ముస్లింలు ఒప్పుకోరన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు ఎవరు పార్టీని మారరన్నారు. ఒకరిద్దరు నేతలు మారాలనుకుంటున్నప్పటికీ వచ్చే నష్టమేమీ లేదన్నారు.

తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెసుకు నష్టం తప్పదన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి కూడా తెలుసునన్నారు. కాబట్టి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. కోమటిరెడ్డి సోదరులకు ఉద్యమం కంటే కాంట్రాక్టుల పైనే ప్రేమ అన్నారు. అసలైన కాంగ్రెసు నేతలు ఎవరూ అమ్ముడు పోరన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలకిందపెట్టి యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరన్నారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆంధ్రాలో ఉద్యమానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారని ధ్వజమెత్తారు. బాబు యూ టర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణ ఆలస్యమైందన్నారు.

English summary
Congress party senior leader Palwai Govardhan Reddy has blamed MIM is creating tension for Mahaveer hospital land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X