హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరపైకి 150వసినిమా: చిరంజీవి జోష్, అధిష్టానం హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-Chiranjeevi
హైదరాబాద్: కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న చిరంజీవిలో ఒక్కసారిగా ఉత్సాహం కనిపిస్తుండగా... అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో నైరాశ్యం కనిపిస్తోంది. ఎంతోకాలంగా కేంద్రంలో పదవి కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి అది రాగానే ఒక్కసారిగా ఉత్తేజం కనిపిస్తోంది. గతంలో అసంతృప్తితో కనిపించిన చిరు ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నారు. అదే సమయంలో చాలా రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చిరుకు కేంద్రమంత్రి పదవి రావడం అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఆయన వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం హామీ ఇవ్వడంతోనే ఆయనలో జోష్ కనిపిస్తోందంటున్నారు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితర పార్టీ నేతలు ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ చిరంజీవికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఇప్పటికే హామీ వచ్చిందంటున్నారు. పార్టీలో చిరంజీవికి క్రమంగా మద్దతు కూడా పెరుగుతోంది.

చిరులో క్రమంగా జోష్ కనిపిస్తుండగా కిరణ్ వైఖరి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కిరణ్ పట్ల మొదట అసంతృప్తితో ఉన్న అధిష్టానం తెలంగాణ కవాతు తర్వాత కొంత మెతక వైఖరిని అవలంభించింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్లడం, మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించడం, పలువురు కిరణ్‌ను వ్యతిరేకించే పార్టీ నేతలు ఫిర్యాదులు చేయడం నేపథ్యంలో మళ్లీ కిరణ్ పరిపాలన పైన అధిష్టానం పట్ల అసంతృప్తి కనిపిస్తోంది.

అందుకే ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయంటున్నారు. కిరణ్ తీరు గమనిస్తుంటే ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. అధిష్టానం ఆయన పాలన పట్ల అసంతృప్తి ప్రదర్శించిన మొదట్లో తన పాల్గొన్న బహిరంగ సభల్లో పదవులు శాశ్వతం కాదంటూ నిరాశ ప్రకటించే వారని, తెలంగాణ కవాతు తర్వాత కిరణ్‌లో నూతనోత్సాహం కనిపించిందని, అయితే సిఎం మార్పు ఊహాగానాల నేపథ్యంలో మరోమారు ఆయనలో ఇటీవల ఉత్సాహం కనిపించడం లేదని అంటున్నారు.

వారం రోజుల క్రితం నీలం తుఫాను ప్రభావిత జిల్లాల ఏరియల్ సర్వే కోసం వెళ్లిన కిరణ్ హఠాత్తుగా తన పర్యటనను మూడు జిల్లాలకు బదులు రెండు జిల్లాలోనే ముగించుకొని వచ్చారు. ఈ రోజు(బుధవారం) బాలల దినోత్సవం సందర్భంగా ఆయన పదవులు శాశ్వతం కాదంటూ మరోసారి వేదాంతం వల్లించారని చెబుతున్నారు.

English summary
It is said that Chiranjeevi is in full josh with Congress party High Command assurance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X