విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నపిల్లలు నావెంటే, ప్రకాశ్‌రాజ్‌లా ఉండొద్దు!: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: సినిమాలకు దూరమై ఇన్ని ఏళ్లు గడుస్తున్నప్పటికీ తనను చిన్నారులు ఇప్పటికీ అభిమానిస్తున్నారని కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో స్థానిక పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు చెందిన రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పిల్లలతో గడిపేందుకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఎవరైనా కథ చెప్పేందుకు వచ్చినప్పుడు అందులో చిన్న పిల్లల పాత్ర ఉందంటే దానివైపు తాను మొగ్గు చూపుతానని చెప్పారు. పసివాడి ప్రాణం నుండి ఆ తర్వాత తీసుకున్న ఎక్కువ సినిమాలు చిన్న పిల్లలు ఉన్నవే తీశానన్నారు. సినిమాలకు తాను దూరమైనప్పటికీ తనను చిన్నారులు ఇప్పటికీ ఆభిమానిస్తున్నారని చెప్పారు.

పిల్లలతో మాట్లాడితే ఒత్తిడి దూరం అవుతుందన్నారు. వారితో కాసేపు మాట్లాడితే అన్ని సమస్యల్ని ఇట్టే మరిచిపోతామన్నారు. తాను పిల్లలతో గడిపేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పిల్లల మనసెరిగి పెద్దలు నడుచుకోవాలని హితవు పలికారు. తాను కామర్స్ విద్యార్థిని అయినప్పటికీ సైన్స్ అంటే ఎంతో ఇప్పటికీ ఇష్టం అన్నారు. అదంతా తన సైన్స్ మాస్టర్ చలువే అన్నారు. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడూ దేశ భవిష్యత్తుపై తన తనయ ఇందిరాగాంధీతో చర్చించే వారన్నారు. బాలల దినోత్సవంలో తాను అధికారికంగా పాల్గొనడం ఇదే మొదటిసారి అన్నారు. తరగతి గది నుండి వ్యక్తిత్వ వికాసం ప్రారంభమవుతుందన్నారు. ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అన్నారు. తల్లిదండ్రులు బొమ్మరిల్లు సినిమాలోని ప్రకాశ్ రాజ్‌లో ఉండవద్దని హితవు పలికారు.

పర్యాటరంగాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో మనం విఫలమయ్యామన్నారు. కూచిపూడి నాట్యానికి క్రమంగా ఆదరణ తగ్గుతోన్న విషయం వాస్తవమే అన్నారు. ఆ నాట్యం వృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. పెద్దలు మంచిమాట చెబితే పిల్లలు తప్పకుండా ఆచరిస్తారన్నారు.

English summary
Central Minister Chiranjeevi said childrens are liking him very much after come out from film industry also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X