వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే ఫలితాలు: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ జాతకాలను పరీక్షించుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారంలోకి దిగాయి. సాధారణ ఎన్నికలు 2014లో జరగనున్నాయి. కాంగ్రెసు, బిజెపి, బిఎస్పీ, ఎన్సీపి వంటి రాజకీయ పార్టీల నాయకులు వోటర్లను తమకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెసు నేతృత్వంలోని కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తుండగా, ఈసారి యుపిఎను తుడిచిపెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బిజెపి నాయకత్వంలోని ఎన్డీయె ఎత్తులు వేస్తోంది. ప్రజలను బుజ్జగించే ప్రయత్నాలు సాగిస్తోంది. బిఎస్పీ, ఎన్సీపి వంటి రాజకీయ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ జపమే చేస్తున్నాయి.

ఇన్‌సైట్ డాట్ కామ్ నిర్వహించిన సర్వే ఏ పార్టీ ప్రజల మనసు దోచుకుంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించింది. ఏ పార్టీ ప్రజల మనసు దోచుకుంటుందనేది తేలడం లేదు. చిత్రం అస్పష్టంగానే ఉంది. కుంభకోణాలు, అవినీతి కేసుల్లో పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా ఇరుక్కుపోయారు. వారు ప్రజల మద్దతు పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇన్‌సైట్ డాట్ కామ్ ఆరు రాజకీయ పార్టీలపై అభిప్రాయం కోరుతూ సర్వే నిర్వహించింది. కాంగ్రెసు, బిజెపి, బిఎస్పీ, ఎన్సీపి, సిపిఐ, సిపిఎంలపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. మొత్తం 2,357 మంది ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్నారు. మొత్తం 7,394 సమాధానాలు ఇచ్చారు. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నయో ఇక్కడ చూద్దాం...

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

కాంగ్రెసు తన ప్రజాదరణను కోల్పోయింది. అవినీతి ప్రధానంగా ఇందుకు కారణమని సర్వేలో తేలింది. కాంగ్రెసు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పడానికి సోనియా గాంధీ నాయకత్వంపై, 2జి కుంభకోణంపై, ఇతర అంశాలపై 1,926 వ్యాఖ్యలు వచ్చాయి.

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

బిజెపి గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ 1,865 వ్యాఖ్యలు వచ్చాయి. బిజెపిలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వచ్చారు. ఆయనపై ఒకే వాక్యంలో వ్యాఖ్యలు వచ్చాయి. అద్వానీ, వాజ్‌పేయి, హిందూత్వ వంటి పదాలను బిజెపిపై వ్యాఖ్యానించడానికి వాడారు. బిజెపికి కూడా అవినీతి తెగులు సమస్యగానే మారినట్లు సర్వేను బట్టి తెలుస్తోంది.

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ)పై 1,425 వ్యాఖ్యలు వచ్చాయి. అవినీతితో పాటు ఏనుగు, మాయావతి, కులం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయి.

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సిపీపై 1,336 వ్యాఖ్యలు వచ్చాయి. అవినీతి, పవార్, కుంభకోణం వంటి పదాలను ఆ పార్టీ గురించి చెప్పడానికి వాడారు. ఎన్సీపి యుపిఎలో కీలక భాగస్వామి అనే విషయం తెలిసిందే.

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

సిపిఐ గురించి వివరిస్తూ 1,408 వ్యాఖ్యలు వచ్చాయి. సిపిఐ గురించి వివరించడానికి వృధా, సమ్మె, కమ్యూనిజం, ప్రయోజనశూన్యం, అవినీతి వంటి పదాలను సిపిఐని వర్ణించడానికి వాడారు.

సర్వే: పార్టీలపై ప్రజలు ఏమంటున్నారు?

సిపిఎం గురించి చెబుతూ 1,360 వ్యాఖ్యలు వచ్చాయి. ప్రయోజనశూన్యం, వృధా, అవినీతి, కమ్యూనిజం వంటి పదాలను సిపిఎం గురించి చెప్పడానికి వాడారు. కంచుకోటలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 2011 ఎన్నికల్లో ఈ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.

English summary
Political parties in India have already started their pre-poll campaigns all around the country as Lok Sabha elections are knocking at the door. The crucial elections are expected to be held in 2014. Starting from Congress to BJP, BSP to NCP all seem to be busy in wooing their fellow countrymen to get votes during the elections which will decide the fate of all political parties after electing the central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X