హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మతతత్వమే: మజ్లిస్‌పై కాంగ్ ఎదురుదాడి: వివేక్ విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్న మజ్లిస్ పార్టీ పైన కాంగ్రెసు పార్టీ నేతలు తమ దూకుడును పెంచారు. మజ్లిస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మజ్లిస్ పార్టీ కొత్త మిత్రుల్ని వెతుక్కొని తమను విమర్శిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి శైలజానాథ్ గురువారం అన్నారు. మజ్లిస్ పార్టీ పెద్ద మతతత్వ పార్టీ అని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ విమర్శించారు.

ఇన్నాళ్లూ మజ్లిస్‌తో కలిసి ముస్లింల అభివృద్ధికి పాటు పడ్డామని, ఇప్పుడు ఆ వర్గాల అభివృద్ధికి పాటుపడేందుకు మాత్రమే కలిసి రావాలని సూచించామన్నారు. కాంగ్రెసును మతతత్వ పార్టీ అన్న మజ్లిస్ చీఫ్, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని షాజహాన్ డిమాండ్ చేశారు.

కులం, మతం, ప్రాంతం పేరుతో కాంగ్రెసు పార్టీ రాజకీయాలు చేయదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఆయా ప్రాతిపదికల మీద ఏర్పడిన రాజకీయ పార్టీల వల్ల దేశం బలహీనపడుతుందన్నారు. విభజన రాజకీయాల్ని కాంగ్రెసు ప్రోత్సహించదని, అలాంటి రాజకీయాలు దేశాన్ని ముక్కలు చేస్తాయన్నారు. కేబినెట్ విస్తరణ కాంగ్రెసు సిద్ధాంతాలకు అద్దం పట్టిందన్నారు. కాంగ్రెసు నిజమైన లౌకికవాద పార్టీ అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వల్లే మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ న్యూఢిల్లీలో ఆరోపించారు. ముఖ్యమంత్రి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. మైనార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సిఎం వ్యవహార శైలితో బాధపడకుండా మజ్లిస్ యూపిఏతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

English summary

 Congress party leaders were started counter attack on MIM party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X