2014 టార్గెట్: కో ఆర్డినేషన్ ప్యానెల్ హెడ్ రాహుల్

కమిటీ హెడ్‌గా నియమితులు కావడాన్ని బట్టి కాంగ్రెసు వచ్చే సాధారణ ఎన్నికలను రాహుల్ ఎదుర్కోవడానికి సమాయత్తమైనట్లు అర్థమవుతోంది. ప్రధాని పదవి అభ్యర్థిగా ఆయన ముందుకు వస్తారని అంటున్నారు. కమిటీ సభ్యులుగా సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, దిగ్విజయ్ సింగ్, మధుసూదన్ మిస్త్రీ, జైరాం రమేష్ ఉంటారు.
మరో సబ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ముందు పొత్తులు కుదుర్చుకునే గ్రూపునకు సీనియర్ నేత ఎకె ఆంటోనీ నేతృత్వం వహిస్తారు. రక్షణ మంత్రి ఆంటోనీ ఎన్నికల ప్రణాళిక, ప్రభుత్వ కార్యకలాపాల రూపకల్పన సబ్ గ్రూపునకు నేతృత్వం వహిస్తారు. కమ్యూనికేషన్, పబ్లిస్టిటీ సబ్ గ్రూపునకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వం వహిస్తారు.
వచ్చే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సూరజ్ కుండ్ మేధోమథన సదస్సులో సోనియా గాంధీ సమన్వయ కమిటీని, మూడు సబ్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు ఎఐసిసి మీడియా డిపార్టుమెంట్ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్న ద్వివేది చెప్పారు.












Click it and Unblock the Notifications