ఒపీనియన్ పోల్: మోడీపై పట్నవాసుల మోజు

సోనియా తనయుడు రాహుల్ గాంధీని 13 శాతం మంది అంగీకరిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు 5 శాతం మంది, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌కు రెండు శాతం మంది ఓటేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేకపోతోందని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి యుపిఎ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల 36 శాతం మంది అభిప్రాయపడ్డారు.
తమ ఉద్యోగాలకు ప్రస్తుతం భద్రత లేదని 60 శాతం మంది అభిప్రాయపడగా, ప్రస్తుత ఆదాయంతో తాము సౌకర్యంతో ఉన్నామని 35 శాతం మంది చెప్పారు. అవినీతి విచ్చలవిడిగా పెరగడానికి రాజకీయ నాయకులే కారణమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల అవినీతిపై బాంబులు వదులుతున్న అరవింద్ కేజ్రీవాల్‌కు 12 శాతం మంది మద్తతు మాత్రమే లభించింది.
అన్నా హజారే గాంధేయ పద్ధతి నిరసన చాలా మంచిదని 62 మంది అభిప్రాయపడ్డారు. విదేశాల్లోని భారతీయుల డబ్బు తిరిగి తెప్పించాలని డిమాండ్ చేస్తున్న యోగా గురు బాబా రాందేవ్‌కు ఐదు శాతం మంది మద్దతిచ్చారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. సంస్కరణలను సరిగా అమలు చేయడం లేదని సర్వేలో పాల్గొన్న యాభై శాతం మంది అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications