అనంత ఆదర్శ గ్రామానికి రానున్న ఆంగ్ సాన్ సూకీ

ఈ గ్రామాన్నే అంగ్‌సాన్ సూకీ సందర్శించనుండడమే. గ్రామంలో 16 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఈ గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు.. తీసుకున్న బ్యాంకు రుణాలను వంద శాతం తిరిగి చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. రుణాలు మంజూరు, రికవరీ, బ్యాంకు లింకేజీ, సేంద్రీయ పద్దతిలో పంటల సాగు, బీమా వంటి వాటిలో పాపసానిపల్లి గ్రామం మొదటి స్థానంలో నిలిచి ఆదరగ్రామంగా ఎంపికైంది.
తాము ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందామో సూకీకి వివరించేందుకు సప్తగిరి మహిళా సంఘం సభ్యురాలిని అధికారులు ఎంపిక చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి తమ గ్రామానికి వచ్చారని.. ప్రస్తుతం అంగ్ సాన్ సూకీ రావడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాగా ఆంగ్ సాన్ సూకీ బుధవారం న్యూఢిల్లీలోని శాంతివనంలో దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రుకు ఆమె నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications