లిక్కర్ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

చద్దాకు బిఎస్పీ అధినేత మాయావతితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పాటు ఆయనకు సినీ, పంచదార, స్థిరాస్తి వ్యాపారాలున్నాయి. మొదట అయోమయంగా సమాచారం వచ్చింది. ఆ తర్వాత కాల్పుల్లో చద్దాతో పాటు అతని సోదరుడు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.
కుటుంబంలోని కక్షలే కారణాలే హత్యకు కారణమని పోలీసులు అన్నారు. కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. ఇద్దరు సోదరులు పరస్పరం కాల్చుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇటీవలి రియల్ ఎస్టేట్ డీల్ విభేదాలకు కారణమని అంటున్నారు.
చద్దా శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూరాయి. మొరదాబాద్‌లోని చద్దా పూర్వీకుల ఇంట్లో అక్టోబర్ 5వ తేదీన కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో ఎవరూ గాయపడలేదు. ఇద్దరు సోదరులు చద్దా గ్రూప్‌ను నడుపుతుంటారు.












Click it and Unblock the Notifications