బాబుతో లోకేష్, భువనేశ్వరి: చెట్టు కింద భోజనం

చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు 49వ రోజు. బాబు యాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనడం గమనార్హం. అంతకుముందు బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఓ చెట్టు కింద భోజనం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇలాగే చైతన్య రథంపై తిరిగారు. బాబు పాదయాత్రతో తెలుగుదేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. భువనేశ్వరి, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఉదయం నుండే బాబుతో కలిసి పాల్గొన్నారు.
మరోవైపు కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల కోసం పని చేసే సమర్థతం లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పదవిలో కొనసాగే అర్హత లేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని, అవిశ్వాసంపై ఆయన పెదవి ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications