చంద్రబాబు ఒక్కరే మిగులుతారు: ప్రవీణ్, అమర్నాథ్

Amarnath Reddy and Praveen Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఉదయం కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండులో విజయమ్మను వారు కలిశారు. పార్టీలో చేరే అంశంపై వారు విజయమ్మతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని ఆయన తప్పు పట్టారు. పార్టీ తనను బహిష్కరించిన విషయంపై స్పందిస్తూ అమర్నాథ్ రెడ్డి స్పందిస్తూ... తమను టిడిపి బహిష్కరించడం కాదని, టిడిపినే రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బహిష్కరించారన్నారు.

చిత్తూరు జిల్లాలో త్వరలో జరిగే బహిరంగ సభలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. అందుకే తాను జగన్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మైనార్టీలో పడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో టిడిపిలో చంద్రబాబు ఒక్కరే మిగులుతారన్నారు. ప్రజల అభీష్టం మేరకే తాము జగన్ పార్టీలో చేరుతున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+