కిరణ్ ప్రభుత్వానికి ఢోకాలేదు, ఎలా కూల్చుతారు: డిఎల్

DL Ravindra Reddy
కడప: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్న వారు ఎలా పడగొడతారో చెప్పాలని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం కడప జిల్లాలో అన్నారు. 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు లేదా తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టినా తాము ధీటుగా ఎదుర్కొంటామని రవీంద్రా రెడ్డి చెప్పారు.

అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందనడం సరికాదన్నారు. ఎలా పడిపోతుందో చెప్పాలని ప్రశ్నించారు. మజ్లిస్ వ్యవహారాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని డిఎల్ చెప్పారు. త్వరలో సమస్యలు అన్నీ సర్దుకుంటాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి లేదని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వేరుగా అన్నారు. 2014లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి పల్లం రాజు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో అన్నారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటారని, అందుకే కాంగ్రెసుకే ఓటు వేస్తారన్నారు. దేశవ్యాప్తంగా పలు సమస్యలు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ ఎదుర్కోవాల్సిన అవసరముందన్నారు. ఎన్నికలు ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు.

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కాంగ్రెసు పార్టీని వీడరని మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. పోలవరం రాకుంటే రాజీనామా చేస్తానని తాను చెప్పిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+