రాజకీయాల కోసం కాదు: భగీరథ యాత్రపై రఘువీరా

రఘువీరా రెడ్డి చేపట్టిన ఈ యాత్రను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. జలయజ్ఞం ధన యజ్ఞమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, వారి ఆరోపణలు అబద్దమని చెప్పేందుకు హంద్రీనీవానే మంచి నిదర్శనమని ఈ సందర్భంగా బొత్స అన్నారు.
రైతుల్లో ఆత్మస్థైర్యం, ధైర్యం నింపేందుకే తాను ఈ పాదయాత్రను చేస్తున్నానని రఘువీరా రెడ్డి చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిలల వలే తాను రాజకీయాల కోసం పాదయాత్ర చేయడం లేదన్నారు.
రైతుల కోసం, రాయలసీమ ప్రజల కోసమే చేస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 33 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు.












Click it and Unblock the Notifications