మందు, విందు డ్యాష్..డ్యాష్: బాబుపై గోనే సంచలనం

ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. గొర్రెల్లా అమ్ముడుపోతున్నారని చంద్రబాబు ఎమ్మెల్యేలను అవమానపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. వైస్రాయ్ తరహా రాజకీయాల వల్లే బాబు నెట్టుకొస్తున్నారని గోనె ప్రకాశ్ రావు చెప్పారు. ఎన్టీఆర్‌ను తొలగించేందుకు చంద్రబాబు అప్పుడు ఎమ్మెల్యేలకు మందు, విందు, డ్యాష్ డ్యాష్ ఏర్పాటు చేశారన్నారు. వీటిపై సాక్ష్యాలు తీసుకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. నమ్మించి మోసం చేయడం ఆ తర్వాత గొంతు కోయడం ఆయన నైజం అన్నారు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తోడల్లుడు, బావమరుదులకు పంగనామాలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల్ని కొని నీచ రాజకీయాలు చేయడం బాబుకు మాత్రమే సాధ్యమయ్యే పని అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications